హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ప్రతి చోటా హిట్స్ కొడుతున్న హీరో ధనుష్. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, ధనుష్ మాత్రం పాన్ ఇండియాలోని అన్ని మేజర్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. చాలా రోజులుగా తెలుగులో డబ్బింగ్ సినిమాలతో ఆడియన్స్ ని పలరిస్తున్న ధనుష్, మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తూ చేసిన సినిమా ‘సార్/వాతి’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ బైలింగ్వల్ సినిమాని సీతారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ధనుష్ పక్కన సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ‘వాతి’ సినిమాపై కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. జీవీ ప్రకాష్, ధనుష్ ల కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి అనౌన్స్మెంట్ తోనే ‘వాతి’పై ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ‘వాతి’ టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది, తెలుగులో కూడా ‘మాస్టారు మాస్టారు’ అంటూ బయటకి వచ్చి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఇలా రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన మేకర్స్, లేటెస్ట్ గా ‘వాతి’ ఆడియో లాంచ్ ని గ్రాండ్ గా చెయ్యడానికి రెడీ అయ్యారు. ఫిబ్రవరి 4న వాతి సినిమా ఆడియో లాంచ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చెన్నైలో జరగనున్న ఈ ఆడియో లాంచ్, వాతి సినిమాపై హైప్ ని భారీగా పెంచుతుంది. మరి ఆ హైప్ ని వెంకీ అట్లూరి అండ్ టీం ఎంతవరకూ అందుకుంటారు అనేది తెలియాలి అంటే ఫిబ్రవరి 17 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. అయితే ఈ బైలింగ్వల్ మూవీకి తెలుగులో సమంతా నటించిన ‘శాకుంతలం’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది.
Let the celebration begin 🎉
நம்ம #வாத்தி வரார் 🔥#Vaathi Grand Audio Launch on 4th Feb 🥳#VaathiVaraar 🕺@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @7screenstudio @adityamusic pic.twitter.com/yCY3J3Pc7N
— Sithara Entertainments (@SitharaEnts) February 1, 2023