Bank Holidays: 2022 ముగిసి 2023లో అడుగుపెట్టాం.. ఈ ఏడాదిలో మొదటి నెల జనవరి ముగింపునకు వచ్చింది.. మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెలలో అడుగుపెట్టబోతున్నాం.. ఇక్కడే నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఫిబ్రవరి నెలలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగినా.. వెబ్ మరియు పోర్టబుల్ బ్యాంకింగ్ సౌకర్యంతో పాటు చాలా మంది వ్యక్తుల జీవితాల్లో బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, నిర్దిష్ట పనుల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిందే.. పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణలు మరియు డిమాండ్ డ్రాఫ్ట్‌లు లాంటి సర్వీసుల కోసం బ్యాంకులకు వెళ్లా్సిందే.. అయితే, ఏవైనా ముఖ్యమైన బ్యాంక్ సంబంధిత పనులను ఉంటే సమస్యలు లేకుండా ముందే పూర్తి చేసుకోవడం మంచిది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఫిబ్రవరి నెలలో మొత్తం 10 బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇందులో మహాశివరాత్రి వంటి పండుగలు, అలాగే సాధారణ వారాంతాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 2023లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా..
– ఫిబ్రవరి 5, 2023 ఆదివారం
– ఫిబ్రవరి 11, 2023 రెండో శనివారం
– ఫిబ్రవరి 12, 2023 ఆదివారం
– ఫిబ్రవరి 15, 2023 Lui-Ngai-Ni పండుగ (హైదరాబాద్)
– ఫిబ్రవరి 18, 2023 మహాశివరాత్రి
– ఫిబ్రవరి 19, 2023 ఆదివారం
– ఫిబ్రవరి 20, 2023 – మిజోరం రాష్ట్ర దినోత్సవం
– ఫిబ్రవరి 21, 2023- లోసార్ పండుగ
– ఫిబ్రవరి 25, 2023 – నాలుగో శనివారం
– ఫిబ్రవరి 26, 2023 – ఆదివారం సెలవులు ఉన్నాయి.