సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా, ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్‌ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ గేమ్ షో హోస్ట్, మహేష్ అతిథిగా బుల్లితెరపై ప్రేక్షకులకు కన్నుల విందుగా అన్పించింది. అయితే వీరిద్దరూ టీవీ షోలో పాల్గొనడం ఇదే మొదటిసారి.
Read Also : “అఖండ” థియేటర్లో అగ్ని ప్రమాదం
ప్రోమోతోనే ఈ గేమ్ షోపై భారీగా హైప్ పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్‌కి మంచి ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఈ షో గ్రాండ్‌గా ముగియబోతోందని, ఈ చివరి ఎపిసోడ్ లో మహేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. మహేష్ లోపలికి వెళ్లగానే సాదరంగా హాగ్ ఇచ్చి ఆహ్వానించారు. మహేష్ సైతం సెట్ బాగుందని మెచ్చుకున్నారు. అంతేకాదు వీరిద్దరి మధ్య షో ఆద్యంతం సాగిన సంభాషణ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ షోలో మహేష్ 25 లక్షలు గెలుచుకున్నారు.