ప్రముఖ ఎస్తేర్ నోరోన్హా సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన షాకింగ్ కామెంట్స్ కు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి మాట్లాడింది. “1000 అబద్దాలు” సినిమాతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ ఎస్తేర్. ఆ తర్వాత “భీమవరం బుల్లోడు”, “గరం”, “జై జానకి నాయక” వంటి చిత్రాల్లో కూడా నటించింది. అయితే ఆ తరువాత సినిమాలకు దూరమైన ఈ 31 ఏళ్ల నటి ప్రముఖ గాయకుడు, నటుడు నోయెల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వారి వివాహ జీవితం ఎక్కువ రోజులు కొనసాగలేదు. వ్యక్తిగత విబేధాల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
Read Also : Megastar Wedding Anniversary : స్పెషల్ వెకేషన్ ప్లాన్
ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రీఎంట్రీకి సిద్ధమైంది. తన తాజా చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇండస్ట్రీలో తన అనుభవాల గురించి మాట్లాడుతూ తొలి విజయం తర్వాత తన కెరీర్‌ను కొనసాగించకపోవడానికి కాస్టింగ్ కౌచ్ సమస్య ఒక కారణమని చెప్పుకొచ్చింది. ఒక నటుడు లేదా దర్శకుడితో పడుకోవాలనే ఏకైక కారణంతో తాను చాలా చిత్రాలను తిరస్కరించానని ఎస్టర్ చెప్పింది. కొంతమంది తనను కమిట్మెంట్ అడిగారని, ఒప్పుకోకపోతే వెనకబడతావని, ఇండస్ట్రీలో ఉండలేవని బెదిరించారని వెల్లడించింది. తనకు సినిమాలంటే ఇష్టమే అయినా, అదే ప్రపంచం కాదని, సినిమా అవకాశాల కోసం అలాంటి పనులు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.