గత కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడడం లేదని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే ఈ విషయాన్నీ ఆ రెండు కుటుంబాలు బయటపెట్టకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్నీ కన్ఫర్మ్ చేసేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగా ఫ్యాన్స్ చేసిన ఒక పని బన్నీ ఫ్యాన్స్ ను హార్ట్ చేయడం, వారు కోపంతో ఊగిపోవడం, ట్విట్టర్ లో తమ కోపాన్ని వెళ్లగక్కడం హాట్ టాపిక్ గా మారింది. అస్సలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం జనసేన అభిమానులు పవన్ కు మద్దతు ఇస్తూ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. తాజాగా మెగా ఫ్యాన్స్ తో పాటు జనసేన సభ్యులు కలిసి మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామి నాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో మెగా ఫ్యాన్స్ ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి తగ్గట్టు ఒక బ్యానర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్ లో మెగా ఫ్యామిలీ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు ఫోటోలను మాత్రమే పెట్టారు. అదే ఇప్పుడు ఇంత వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్ లో అల్లు అర్జున్ ఫోటోను ఎందుకు పెట్టలేదంటూ బన్నీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. అంటే మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ను పట్టించుకోవడం లేదని ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నారని, మెగా హీరోల జాబితా నుంచి బన్నీ ని తొలగించినట్లు పేర్కొంటున్నామని అది కావాలనే మెగా ఫ్యాన్స్ తీసుకున్న నిర్ణయమని అంటున్నారు. అందుకు తగ్గట్టే వారి స్పీచ్ లు కూడా ఉన్నాయని సమాచారం.
చెప్పను బ్రదర్.. వదిలేది లేదు బ్రదర్.. చిరంజీవి, మెగా ఫ్యామిలీ తప్ప వేరేవారు మనకు అవసరం లేదని, అలాంటివారిని లెక్కలోకి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మెగా ఫ్యాన్స్ మీటింగ్ లో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ మాటలపై చిరంజీవి ఏమైనా అన్నా కానీ పడతామని, అంతేకాని వేరేవాళ్లను మెగా ఫ్యామిలీలో కలిపే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” ఏం పీకలేరు బ్రదర్” అనే హ్యాష్ ట్యాగ్ తో మెగా ఫ్యామిలీని ఏకిపారేస్తున్నారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ ట్విట్టర్ లో కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికాగా గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. బన్నీ తాత అల్లు రామలింగయ్య కారణంగానే చిరంజీవి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క మెగా ఫ్యాన్స్ చిరు లేకపోతే అస్సలు వీరందరూ ఎక్కడ ఉండేవారు అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఏ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.