టాలీవుడ్ మరియు కోలీవుడ్ వర్గాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ గురించి ఇప్పుడు క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో సినిమా పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టించుకున్న లోకేష్ కనగరాజ్‌కు, అల్లు అర్జున్‌తో సినిమా చేయడం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని సమాచారం. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాను లోకేష్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఎల్‌సియు (LCU)లో భాగంగా ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉన్నప్పటికీ, వీరిద్దరి కాంబో మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:The Raja Saab Runtime: తగ్గిన ‘ది రాజాసాబ్’.. ఫైనల్ రన్ టైం ఇదే!
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన మైత్రీ, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 జూలై నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, వచ్చే ఏడాది ప్రథమార్ధం నాటికి స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసి జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ – లోకేష్ సినిమా మిస్ అవ్వడంతో నిరాశలో ఉన్న మెగా అభిమానులకు, అల్లు అర్జున్ రూపంలో ఒక భారీ అనౌన్స్‌మెంట్ రావడం పెద్ద ఊరటనిచ్చింది. బన్నీ స్టైల్ మరియు లోకేష్ మార్క్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ ప్రాజెక్టులోకి బన్నీ అడుగుపెట్టబోతున్నారు.