Jingo : డాలీ ధనంజయ ప్రధాన పాత్రలో వస్తున్న మూవీ “జింఘో”. ధనంజయ పుట్టినరోజు సంరద్భంగా మూవీ నుంచి సెకండ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. డాలీ పిక్చర్స్, త్రిశూల్ విజనరీ స్టూడియోస్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తుండగా.. శశాంక సోగల్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో గతేడాది మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ నుంచి వచ్చిన “నారా నారా జింఘో” మ్యూజిక్ ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంది.
Read Also : Mahesh Vitta : తండ్రి అయిన పాపులర్ కమెడియన్..
“నేడు డాలి ధనంజయ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన లుక్ బర్త్ డే సందర్భంగా సింక్ అయినట్టే ఉంది. 2026లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్టర్ శషాంక్ సోగల్ తెలిపారు. రాజకీయ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్ ఇలా అన్ని అంశాలను ఇందులో మేలవించినట్టు తెలిపారు. తమ సినిమాలో డాలి ధనుంజయ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు శషాంక్ సోగల్.
Read Also : Chiranjeevi : నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?