Mahesh Vitta : టాలీవుడ్ కమెడియన్ తండ్రి అయ్యాడు. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. అతను ఎవరో కాదు మహేవ్ విట్టా. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ లో మొదట్లో కామెడీ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు పొందాడు. అక్కడి నుంచి వరుసగా షోలు చేశాడు. మరోసారి బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడే తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. తాను శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్టు చెప్పిన మహేశ్.. అదే ఏడాది పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటి నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న మహేశ్.. ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు.
Read Also : Chiranjeevi : నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?
రెండు నెలల క్రితం తన భార్య ప్రెగ్నెంట్ అని చెప్పాడు. గత నెలలో శ్రీమంతం వేడుక ఫొటోలను కూడా బయట పెట్టాడు. ఇప్పుడు తాజాగా తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అతనికి విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం మహేశ్ ఓ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. గతంలో జాంబిరెడ్డి, కొండపొలం లాంటి సినిమాల్లో నటించాడు. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు.
Read Also : SSMB 29 : త్రిబుల్ ఆర్ ను మించిన ఇంటర్వెల్ సీన్.. జక్కన్న భారీ స్కెచ్..