సిద్దు జొన్నలగడ్డ, నేహా శర్మ జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు.. ‘అట్లుంటది మనతోని’ అనేది దీనికి ట్యాగ్ లైన్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. ” డీజే అంటే ప్రాణమిచ్చే కుర్రాడు టిల్లు.. ఎలాగైనా సరే ఒక సినిమాకు సాంగ్ పాడాలని చూస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి రాధికా ఆప్టే(నేహశెట్టి) పరిచయమవుతుంది. ఆమెను పడేయడానికి టిల్లు నానా కష్టాలు పడతాడు. ఇక హీరోయిన్ పడింది అనుకోలోపు ఆమెకు మరో ముగ్గురితో ఎఫైర్ ఉందని తెలుసుకుంటాడు. కానీ, వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని టిల్లును నమ్మించడానికి హీరోయిన్ కష్టపడుతూ ఉంటుంది. మరి చివరికి టిల్లు తన ప్రేమలో నెగ్గుతాడా..? హీరోయిన్ కి, ఆ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి..? ఆమె ఎందుకు అలా చేయాల్సివచ్చింది..? అనేది సినిమాగా చూపించారు.
ఇక వన్ మ్యాన్ షో అన్నట్లు సిద్దు నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ ని పడేయడానికి బన్నీ పేరును వాడడం వినోదాన్ని తెప్పిస్తోంది. హైదరాబాదీ యాసలో టిల్లు డైలాగ్ లు అదిరిపోయాయి. మొత్తానికి ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నేహా అందాలు, లిప్ లాక్ లు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మరుముఖ్యంగా ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి థియేటర్లో డీజే టిల్లు ఎలాంటి సౌండ్ మోగిస్తాడో చూడాలి.