నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. బాలకృష్ణ సరసన కంచె ఫేమ్ నటి ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. బాలయ్య, ప్రగ్యా కలిసి నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. దీనిని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలయ్య సినిమాలో తన పవర్‌ని చూపించనున్నాడని, ఇంటర్వెల్ బ్లాక్ సినిమా లవర్స్‌కి గూస్‌బంప్స్‌ని ఇస్తుందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం “అఖండ” పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. స్పష్టంగా డిస్నీ హాట్‌స్టార్ ‘అఖండ’ పోస్ట్ థియేట్రికల్ ఓటిటి స్టీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది.
Reas Also : మైసూర్ లో ల్యాండైన “బంగార్రాజు”
ఈ యాక్షన్ డ్రామా బోయపాటి శ్రీను, బాలకృష్ణల కాంబోలో వస్తున్న మూడవ చిత్రం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన “సింహా”, “లెజెండ్” చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్లను అందుకున్నాయి. కాబట్టి ఈ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ డ్రామా “అఖండ”తో మ్యాజిక్ మూడవసారి పునరావృతమవుతుందని భావిస్తున్నారు నందమూరి అభిమానులు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.