గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒకే ఒక్క టాపిక్ ‘వెంకటేష్ మహా’. సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతూ KGF సినిమాపై విమర్శలు చేశాడు. సినీ అభిమానులని, KGF హీరో క్యారెక్టర్ ని కూడా ఒక రాంగ్ వర్డ్ తో కామెంట్స్ చేసిన వెంకటేష్ మహాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రెండు ట్యాగ్స్ క్రియేట్ చేసి మరీ వెంకటేష్ మహాని ఇరవై నాలుగు గంటలుగా ట్రోల్ చేస్తూ ఉండడంతో వెంకటేష్ మహా ఈ వివాదంపై స్పందించాడు. ట్విట్టర్ లో వీడియోలు షేర్ చేసిన వెంకటేష్ మహా…
“నేను మాట్లాడిన మాటలు ఓ వర్గానికి చెందిన వ్యక్తుల అభిప్రాయం. అది నా అభిప్రాయం మాత్రమే కాదు. నా సినిమాలు నచ్చిన ఎంతోమంది నాకు చెప్పిన విషయాన్నే ఆ ఇంటర్వ్యూలో నేను తెలియజేశాను అంతే. అయితే.. అది మాట్లాడిన విధానం, వాడిన భాష సరైంది కాదు. దానికి నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ ఓ విషయం చెప్పాలి. నేను మాట్లాడిన మాటలు ఓ సినిమాలోని కల్పిత పాత్ర గురించి మాత్రమే. అంతేకానీ.. ఏ వ్యక్తిని కానీ, ఏ క్రియేటివ్ పర్సన్‌ని కానీ వ్యక్తిగతంగా అన్నమాట కాదు. నా మాటలను ఓ వ్యక్తికి ఆపాదించి చూడడం అనేది.. నా మాటలను మీరు చూసిన విధానం వల్ల వచ్చిన సమస్య కావచ్చు. ఒకే, భావోద్వేగంలో నేను ఓ కల్పిత పాత్రని దూషించాను. దానికి నిజమైన మనిషైన నన్ను అసభ్యంగా తిట్టడం కరెక్ట్ కాదు. ఇది మొదటి సారి కాదు. ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. అందుకే నాకు ఆ అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి.. బడ్జెట్‌ని బట్టి కాకుండా అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.
ఈ వీడియోలి చూసిన వాళ్లు “నీ బాడీ లాంగ్వేజ్, నీ యాటిట్యూడ్ సారీ చెప్తున్నట్లు లేదు. నీ కామెంట్స్ ని వెనక్కి తీసుకోకుండా ఇలా అందరి అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను అనడం కరెక్ట్ కాదు. నా మాటలని మీరు చూసిన విధానం వల్ల వచ్చిన సమస్య అంటున్నావ్, సారీ చెప్పేస్తే ఈ సమస్యే ఉండదు కదా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ మహా వీడియో రిలీజ్ చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ ఆగట్లేదు. చూస్తుంటే ఈ రచ్చ మరి కొన్ని రోజుల పాటు కొనసాగేలా ఉంది.
— Venkatesh Maha (@mahaisnotanoun) March 7, 2023
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023
— Venkatesh Maha (@mahaisnotanoun) March 6, 2023