Director Prashanth Varma Clarity on Hanuman Comparision with Sri Anjaneyam Movie: ఆ, కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు చేసి దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన అనేక విషయాలను ఆయన వెల్లడించారు. ఈ సినిమా కృష్ణవంశీ, నితిన్ కాంబినేషన్లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమా లాగానే ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చారు.
HanuMan: హనుమాన్ ఫస్ట్ రివ్యూ.. ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఏంటో తెలుసా?
శ్రీ ఆంజనేయం సినిమాలో నితిన్ క్యారెక్టర్ కి అదనంగా అర్జున్ గారి క్యారెక్టర్ తోడవుతుంది, అంటే నిజంగా ఆంజనేయస్వామి నితిన్ క్యారెక్టర్ తో సినిమా అంతా ట్రావెల్ అవుతుంది. చివరి ఫైట్ లో మాత్రమే ఆంజనేయ స్వామి మహిమలు నితిన్ లోకి ప్రవేశిస్తాయి. అయితే ఆ సినిమాకి బ్యాక్ స్టోరీ వేరే ఉంది. ఒక మంచి డ్యామ్ కట్టడం కోసం నితిన్ తల్లిదండ్రులు ట్రాక్ చూపించారు, ఇదంతా వేరే పెద్ద కథ. కానీ మా సినిమాకి అలాంటి బ్యాక్ స్టోరీ ఏమీ లేదని చెప్పుకొచ్చారు. సినిమా మొదలైన కొద్ది సేపటికి తేజలోకి ఆంజనేయ స్వామి మహిమలు వస్తే అది ఎలా ఉంటుంది అనేది కేవలం తెరమీద మాత్రమే చూసి ఆనందించగలిగే విషయం అని చెప్పుకొచ్చారు. తమ సినిమాలో ఆంజనేయస్వామి కనిపించరని కేవలం తేజ లోకి ఆంజనేయస్వామి బలం మాత్రమే వస్తుందని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ వెల్లడించారు.