HanuMan First Review is out: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఇండియన్ సూపర్ హీరో సినిమా హనుమాన్. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తన ఊరి కోసం ఆ యువకుడు ఏం చేశాడు? అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదలవుతుంది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్స్ పెద్ద ఎత్తున బుకింగ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి రివ్యూ వచ్చేసింది హిందీ ఫిలిం క్రిటిక్ ట్రేడ్ అనలిస్ట్ తరం ఆదర్శ్ ఈ సినిమా చూసి బాగుందని చెబుతూ వన్ వర్డ్ రివ్యూ ఇచ్చారు. హనుమాన్ ఫాసినేటింగ్ అంటూ ఆయన పేర్కొనడమే కాదు మూడున్నర రేటింగ్ కూడా ఇచ్చారు.
Vyooham Movie: ఆర్జీవీ వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. రేపు వెలుబడనున్న తీర్పు!
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సాలిడ్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని, హనుమాన్ ఎగ్జైటింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాలో డ్రామా, ఎమోషన్స్ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ మైథాలజీతో సింక్ అయ్యేలా చేశారని ఎన్నో గూస్ బంప్ మూమెంట్స్ కూడా ఉన్నాయని ఎక్స్ట్రార్డినరీ క్లైమాక్స్ ఉందని చెప్పుకొచ్చారు. తేజ సజ్జ, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్ వంటి వారు అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చారు. ఇక సినిమాలో విఎఫ్ఎక్స్ ఒక కీలక పాత్ర పోషించిందని హిందీ డబ్బింగ్ కూడా బాగా కుదిరిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇదే విషయం గురించి ప్రశాంత్ వర్మ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం కొంత కుదుటపడిన తర్వాత చూసిన మొదటి సినిమా తమదేనని సినిమా చూసి తనను అభినందిస్తూ 15 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడారని చెప్పుకొచ్చారు.