Skanda 2: సీక్వెల్ కి సిద్ధం… బోయపాటి మాస్ ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీను. బీగోపాల్, వినాయక్, రాజమౌళిల మాస్ ర్యాంపేజ్ తగ్గిన తర్వాత వారిని మించే రేంజులో మాస్ సినిమాలు చేస్తున్నాడు బోయపాటి శ్రీను. బాలయ్యని సింహ, లెజెండ్, అఖండగా చూపించి సాలిడ్ హిట్స్ కొట్టిన బోయపాటి… వెంకీని తులసి చేసాడు, అల్లు అర్జున్ ని సరైనోడు అన్నాడు ఇప్పుడు రామ్ పోతినేనిని స్కందగా ప్రెజెంట్ చేసాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ బీ,సి సెంటర్స్ లో రచ్చ లేపేలా ఉంది. బోయపాటి శ్రీను పక్కా మాస్ మసాలా మార్క్ తో స్కంద తెరకెక్కింది అనే విషయం ఇప్పటికే ట్రైలర్స్ తో చెప్పేసిన బోయపాటి శ్రీను, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి మాస్ పూనకాలు తెప్పించాడట. థమన్ ఉండనే ఉన్నాడు కాబట్టి స్కంద సినిమా మాస్ ఆడియన్స్ కి దొమ్మలు అదిరేలా చేయడం గ్యారెంటీ.
Read Also: Animal: వయొలెన్స్ ఇప్పుడే మొదలయ్యింది… సందీప్ రెడ్డి వంగ పీక్స్
Also Read
మార్నింగ్ షోస్ అయిపోగానే స్కంద సినిమాకి సీక్వెల్ ఉందనే విషయం బయటకి వచ్చేసింది. పార్ట్ 1 ఎండ్ లో స్కంద సినిమాకి సీక్వెల్ ఉంటుందని బోయపాటి శ్రీను చెప్పేసాడు. ట్రైలర్ లో చూపించిన ఒక వైల్డ్ క్యారెక్టర్ ని ఫ్లాష్ బ్యాక్ కథగా స్కంద 2 రూపొందనుంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం స్కంద నుంచి బయటకి వచ్చి సూర్య, బాలయ్యలతో చేయాల్సిన సినిమాలని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల్లో బోయపాటి ఏది ముందు స్టార్ట్ చేస్తాడో తెలియదు కానీ ఈ రెండు కంప్లీట్ అయ్యాకే స్కంద 2 స్టార్ట్ అవ్వనుంది. అయితే అసలు నిజంగానే స్కంద 2 ఉంటుందా లేక ఇది జస్ట్ హైప్ కోసం అలా ఓపెన్ ఎండ్ ఇచ్చి బోయపాటి శ్రీను ఎండ్ కార్డ్ వేశాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
-
Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
-
Chennai Love Story: ప్రీమియర్స్ తో 3 కోట్లు కొల్లగొట్టిన చెన్నై లవ్ స్టోరీ
-
Abhijeet Dipke: సోనమ్ వాంగ్‌చుక్, కాంగ్రెస్‌పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: అమ్మా… నీ కోసమే ఈ ఫిఫ్టీ.. వైభవ్ సూర్యవంశీ భావోద్వేగ ప్రకటన..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!