Kaka Vs Viswambhara: ‘కాకా’ ఓకే.. ‘విశ్వంభర’ చప్పుడు లేదేంటి బాసూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaka Vs Viswambhara: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘కాకా’. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ఒక సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ‘కాకా’ సంక్రాంతికి రాబోతోందని ప్రకటన రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు.. ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అటు ‘విశ్వంభర’ మూవీ రిలీజ్‌పై ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కాకా’ మూవీ సంక్రాంతి రేసులోకి వచ్చేసింది. ఒకవైపు చిత్రీకరణ పనులను పూర్తి చేస్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా ఈ మూవీ మరోసారి వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. ఆ వార్తలకు సినిమా టీం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. మొత్తానికి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ‘విశ్వంభర’ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అది కూడా సంక్రాంతి టార్గెట్ అనే ప్రచారం ఉండనే ఉంది.
Also Read
చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సినిమా మొదలై చాలా రోజులే అయ్యింది. కానీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఇంకెప్పుడు సినిమాను థియేటర్లలో చూస్తామా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటంతో ఆలస్యం అవుతుందని వార్తలు వినిపించాయి. దాంతో సినిమా వాయిదా పడిందని ఫ్యాన్స్ సరిపెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘కాకా’ మూవీ థియేటర్లలోకి రాబోతోంది.. కానీ ‘విశ్వంభర’ మూవీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ ఒక క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఈ మూవీ టీమ్ ఎందుకు మౌనంగా ఉంది? కనీసం వచ్చే ఏడాదిలో అయినా వస్తుందా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్‌పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Kaka Vs Viswambhara: ‘కాకా’ ఓకే.. ‘విశ్వంభర’ చప్పుడు లేదేంటి బాసూ..!
-
Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
-
Ram Charan : టైర్ వన్ హీరోల్లో రామ్ చరణ్‌కి నచ్చే క్వాలిటీస్ ఏంటంటే?
-
Train Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా విజయ్ సేతుపతి, మిస్కిన్ ‘ట్రైన్’ ట్రైలర్! చూశారా?
-
Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని పదవిని పంచుకునేందుకు నెతన్యాహు రెడీ!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!