Train Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా విజయ్ సేతుపతి, మిస్కిన్ ‘ట్రైన్’ ట్రైలర్! చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Train Trailer: విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ మిస్కిన్ కాంబినేషన్లో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రైన్’. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మిస్కిన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచీ దీనిపై మంచి ఆసక్తి ఉంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను వదిలారు. నిమిషంన్నర పాటు సాగే ఈ వీడియో చూస్తుంటే నిజంగానే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. రద్దీగా ఉండే ఓ స్టేషన్ నుంచి సూపర్ ఫాస్ట్ రైలు బయలుదేరడంతో ట్రైలర్ మొదలవుతుంది. ప్రయాణం మొదలైన కాసేపటికే రైలు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని, ఎంత ప్రయత్నించినా వేగం తగ్గడం లేదని లోకో పైలట్లు, సిబ్బంది కంగారు పడుతుంటారు. బయట రైలు అదుపు తప్పి పరుగులు పెడుతుంటే, లోపల బోగీల్లో అంతకంటే భయంకరమైన సీన్లు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా రక్తపు మరకలు, వాటిని తుడుస్తున్న దృశ్యాలు, బాత్రూమ్లలో శవాలు, కదులుతున్న రైలులో కత్తులతో జరిగే భీకర పోరాటాలు.. ఇలా ప్రతి ఫ్రేమ్ టెన్షన్ పెంచేలా ఉంది. ప్రాణభయంతో ప్రయాణికులు రైలులోంచి కిందకు దూకేస్తున్న విజువల్స్ భయపెడుతున్నాయి.
ఈ ట్రైలర్లో సీనియర్ నటుడు నాజర్ లుక్, డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. కంటికి నల్లటి పట్టీ (ఐప్యాచ్) పెట్టుకుని కనిపించిన ఆయన.. “ట్రైన్ నికోలస్.. ఎవరతను? అందరినీ వెతికి పట్టుకోండి.. డిలీట్ చేయండి” అంటూ చెప్పే డైలాగ్ విలనిజం ఏ రేంజ్లో ఉండబోతోందో చూపిస్తోంది. రైలులో ఇంత రక్తపాతం జరుగుతున్నా, తోటి ప్రయాణికులంతా భయంతో వణికిపోతున్నా విజయ్ సేతుపతి మాత్రం ఏమాత్రం కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. “ఇక్కడ చాలా ప్రాణాలు పోతున్నాయి సార్” అని ఓ మహిళ కంగారుగా చెబుతుంటే, “దానికి నేను బాధ్యుడిని కాదు” అన్నట్లుగా ఆయన ఇచ్చే రియాక్షన్ సినిమాపై సస్పెన్స్‌ను మరింత పెంచేసింది. అసలు ఆ రైలులో ఏం జరుగుతోంది? బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఆ మృత్యుపాశం నుంచి ప్రయాణికులను సేతుపతి ఎలా బయటపడేస్తాడు? అన్నది థియేటర్లలోనే చూడాలి.
Also Read
వి క్రియేషన్స్ బ్యానర్‌పై కళైపులి ఎస్. థాను నిర్మించిన ఈ సినిమాకు మిస్కిన్ కథ, దర్శకత్వంతో పాటు సంగీతాన్ని కూడా అందించారు. ట్రైలర్లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఫౌజియా ఫాతిమా కెమెరా పనితనం సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇందులో శ్రుతి హాసన్, నరైన్, యూగి సేతు, కె.ఎస్.రవికుమార్, సంపత్ రాజ్, కలైయరసన్, ఇరా దయానంద్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘ట్రైన్’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తాజావార్తలు
-
Train Trailer: ఒళ్లు గగుర్పొడిచేలా విజయ్ సేతుపతి, మిస్కిన్ ‘ట్రైన్’ ట్రైలర్! చూశారా?
-
Israel Political Crisis: ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాని పదవిని పంచుకునేందుకు నెతన్యాహు రెడీ!
-
Kakinada Municipal Corporation Elections: కాకినాడ కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. వారికి నో ఎంట్రీ!
-
BRS Supports Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు.. కేటీఆర్ కీలక పోస్ట్..
-
TVK vs DMK: స్టాలిన్‌కు ఆర్ఎస్ఎస్ యూనిఫామ్.. ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!