Director Bobby Released CSI Sanatan Teaser: ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా ‘సీఎస్ఐ సనాతన్’. ఇందులో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ కనిపించబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను దర్శకుడు బాబి విడుదల చేశారు. అనంతరం టీజర్ బాగుందంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. టీజర్ విషయానికి వస్తే విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. ఆ హత్య విషయంలో ఐదుగురు అనుమానితులు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తారు. వాటిలో ఏది నిజమనేది విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తూ ముగిసింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం చెబుతోంది.