Confusion on Jr NTR invitation to AP CM Nara Chandrababu Naidu’s swearing-in ceremony: రేపు గన్నవరం సమీపంలో జరగబోతున్న ఏపీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా? లేదా? అనే విషయం మీద సందిగ్దత కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందింది అంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంటనే ఆయన వస్తారా? లేదా? అనే విషయం మీద చర్చలు మొదలయ్యాయి. నిజానికి ఆయన ప్రస్తుతానికి దేవర సినిమా షూటింగ్ నిమిత్తం గోవాలో ఉన్నారు. గోవాలోని కొన్ని ప్రాంతాలలో దేవర సినిమా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన హాజరయ్యే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతున్న క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల నుంచి ఈ ఆహ్వానానికి సంబంధించి మరో రకమైన సమాచారం అందుతుంది.
Yuva Rajkumar: భార్యకు అక్రమ సంబంధం.. రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరో సంచలనం!
అదేమిటంటే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ కు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని వారు చెబుతున్నారు. కేవలం ఇదంతా ప్రచారం మాత్రమేనని చెబుతున్నారు. ఆయన ప్రస్తుతానికి దేవర షూటింగ్ నిమిత్తం గోవాలో బిజీగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందినట్లుగా పలు నేషనల్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ ని ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారా? లేదా? ఆహ్వానిస్తే ఆయన వస్తారా? లేదా? అనే విషయం మీద సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.