Devara Movie Promotions on Full Swing: ప్రస్తుతం ఎక్కడ చూసిన దేవర గురించే చర్చ జరుగుతోంది. అసలు దేవర సౌండ్ ముందు మరో సినిమా పేరు కూడా వినిపిచడం లేదు కదా.. కనీసం ఆ సినిమా రిలీజ్ అవుతుందా? అనే సందేహాలు రాక మానదు. అందులోను అది కార్తి లాంటి స్టార్ హీరో సినిమాకు అంటే.. దేవర పాన్ ఇండియా సౌండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవర సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుండగా.. ఆ నెక్స్ట్ డే కార్తి నటించిన ‘సత్యం సుందరం’ అనే సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ చేశారు. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇటీవల రిలిజ్ అయిన ఈ చిత్ర టీజర్ మంచి ప్రసంశలు అందుకుంది. కానీ దేవరకు పోటీగా రిలీజ్ అవుతుండడమే ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి. పైగా ఎలాంటి ప్రచారం కూడా చేయడం లేదు మేకర్స్.
Jr NTR : వెయ్యి కోట్ల డైరెక్టర్‌తో ‘ఎన్టీఆర్’?
తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. బహుశా.. దేవర ముందు ‘సత్యం సుందరం’ సౌండ్ చేసిన వర్కౌట్ కాదనే భావనలో ఉన్నారో.. లేదంటే సినిమాకు హిట్ టాక్ వస్తే మౌత్ టాక్ చాలని అనుకుంటున్నారేమో గానీ.. కార్తి సినిమాకు ఇక్కడ మంచి క్రేజ్ ఉందనేది మాత్రం నిజం. ఇక దేవర మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతున్నారు. తెలుగులో యంగ్ స్టర్స్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌తో ఎన్టీఆర్, కొరటాల చేసిన ఇంటర్య్వూ దేవర ప్రమోషన్స్‌లోనే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ ఇంటర్య్వూలో ఎన్టీఆర్.. దేవర సినిమా కోసం అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పినట్టుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో.. ఇది కదా ఎన్టీఆర్ అంటే.. అని అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా.. దేవర కన్నడ వెర్షన్ డబ్బింగ్‌ను కేవలం 4 గంటల్లో పూర్తి చేశాడట టైగర్. ఏదేమైనా.. ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!