Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవర రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి పార్ట్ ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్.. ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేడు విజయదశమి ఆయుధ పూజ కావడంతో.. దాన్ని పురస్కరించుకొని.. కొత్త పోస్టర్ తో అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Gunturu Kaaram: మరణ మాస్ లుక్ లో మహేష్.. ఇంతకన్నా ఏం కావాలమ్మా
ఇక పోస్టర్ లో కేవలం కత్తిని మాత్రమే చూపించారు. ఆ కత్తి కూడా చాలా కొత్తగా కనిపిస్తోంది. D ఆకారంలో డిజైన్ చేసిన కత్తిని పట్టిన చెయ్యి దేవరదే అని కన్ఫర్మ్ గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టర్ బావుంది.. ఎన్టీఆర్ ను కూడా చూపించి ఉంటే ఇంకా బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తారక్.. ఆర్ఆర్ఆర్ తో భారీ హిట్ అందుకున్నాడు. రాజమౌళి తో సినిమా చేశాక హీరోలు ప్లాప్ లు అందుకోవడం ఎప్పటినుంచో జరుగుతుంది. ఇక ఆ సెంటిమెంట్ ను తిరగరాయాలని తారక్ ప్రయత్నిస్తున్నాడు. మరి అది జరుగుతుందా.. ? లేదా అనేది చూడాలి.