Gunturu Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక దసరాకు కూడా ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ వస్తుంది అని అనుకున్నారు.. కానీ, ఇప్పుడు కూడా పోస్టర్ తోనే సరిపెట్టారు.
Sampoornesh Babu: సోదరా.. ఇది రొమాంటిక్ కాదు బ్రొమాంటిక్ అంటున్న సంపూ
ఆయుధ పూజ సందర్భంగా.. మహేష్ మరణ మాస్ లుక్ ను రిలీజ్ చేసి ఆయుధ పూజ శుభాకాంక్షలు తెలిపారు. కారులో వెనుక భాగంలో కూర్చొని మహేష్ సిగరెట్ ను అంటిస్తూ.. సీరియస్ లుక్ లో కనిపించాడు. ఇక మహేష్ కాలి దగ్గర కత్తి ఉండడం.. పక్కన విలన్స్ చచ్చి పడి ఉండడంతోనే అర్ధమవుతుంది.. మహేష్ వాళ్లకు చుక్కలు చూపించాడు అని.. ఫైట్ మొత్తం అయ్యాక.. రిలాక్స్ గా సిగరెట్ తాగుతున్నట్లు మహేష్ లుక్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ సింగిల్ త్వరలోనే వస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఆయుధ పూజ రోజున ఇంతకు మించిన పోస్టర్ ఇంకేం కావాలి.. అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో త్రివిక్రమ్ – మహేష్ కాంబో మరో హిట్ ను అందుకుంటుందో, లేదో చూడాలి.