Ranveer Singh : రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నాడు. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ దురంధర. భారీ బడ్జెట్ తో వస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ భారీ రెస్పాన్స్ ను దక్కంచుకున్నాయి. అయితే రణ్ వీర్ సింగ్ కు కార్లంటే చాలా ఇష్టం. తనకు నచ్చిన కారును తన గ్యారేజీలోకి చేర్చేసుకుంటాడు. తాజాగా ఆయన బర్త్ డే కానుకగా భార్య దీపిక పదుకొణె లగ్జరీ కారును గిఫ్ట్ గా ఇచ్చింది. రణ్ వీర్, దీపిక ఎంతో అన్యోన్యంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు ఎప్పుడూ ప్రేమను కురిపించుకుంటారు. అయితే తాజాగా భర్త పుట్టిన రోజుకు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలనుకుందేమో. అందుకే లగ్జరీ కారును ఇచ్చేసింది.
Read Also : Chiranjeevi : విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ లుక్..!
రూ.4.57 కోట్ల విలువ చేసే హై ఎండ్ ఈవీ కారును కొనుగోలు చేసింది. దీన్ని భర్తకు గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ కారులో రణ్ వీర్, దీపిక కలిసి ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దీపిక పదుకొణె ఈ నడుమ ఎక్కువగా వార్తల్లో ఉంటుంది. స్పిరిట్ సినిమా నుంచి ఆమెను తప్పించారు. కానీ అల్లు అర్జున్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. అలాగే కల్కి-2లో కూడా నటించబోతోంది. తల్లి అయినా సరే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది ఈ భామ. అటు రణ్ వీర్ కూడా భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు.
Read Also : HHVM : పాన్ ఇండియాలో ‘వీరమల్లు’ సౌండ్ ఏది..?