HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ దగ్గర పడుతోంది. కానీ ఇంకా ప్రమోషన్లు స్టార్ట్ కావట్లేదు. దాదాపు ఐదేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమాను ఎంత ప్రమోట్ చేస్తే అంత బెటర్. కానీ ఈ విషయంలో వీరమల్లు చాలా వెనకబడ్డాడు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ గానీ.. ఒక ఇంటర్వ్యూ గానీ లేదు. పవన్ కల్యాణ్ అంటే రాజకీయాల్లో చాలా బిజీగా ఉండొచ్చు. కానీ మిగతా వాళ్లకు ఏమైంది. ఒక్క డైరెక్టర్, ఇతర నటులు మాత్రమే ముందుకు వస్తున్నారు. నిధి అగర్వాల్ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు. క్రిష్ ప్రమోషన్లకు దూరంగానే ఉన్నాడు. అసలే పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ.
Read Also : Akshay Kumar : కన్నప్పలో అక్షయ్ కుమార్ ఇంత మోసం చేశాడా..?
అలాంటప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్లు భారీగా చేయాలి కదా. పవన్ గత సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ కాలేదు. పైగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సమయంలో మంచి ప్రమోషన్లు చేస్తే కలెక్షన్లు కూడా ఆశించిన స్థాయిలో వస్తాయి. పాన్ ఇండియా మార్కెట్ ఉన్న ప్రభాస్ లాంటి హీరోలే ప్రతి సినిమాకు పనిగట్టుకుని ప్రమోషన్లు చేసుకుంటున్నారు. అలాంటప్పుడు పవన్ మొదటి మూవీ అయినా.. ఈ సైలెంట్ దేనికో అర్థం కావట్లేదు. పాన్ ఇండియా మూవీ అనే టైటిల్ వేసుకుంటే సరిపోదు కదా. దానికి తగ్గట్టు ప్రమోషన్లు వగైరా చేసుకుంటేనే జనాలు గుర్తిస్తారు. ఈ విషయం వీరమల్లుకు తెలియనిది కాదు. అయినా ఎందుకో పాన్ ఇండియాలో సౌండ్ లేకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. ఇది మూవీకి నష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు.
Read Also : Dhanush : కాలిపోతున్న పత్తిపంట.. ధనుష్ మరో సంచలన మూవీ..