పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సాంగ్ సందడి మామూలుగా లేదు. “లాలా భీమ్లా” అంటూ సాగిన ఈ సాంగ్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ ఇంకా ట్రెండింగ్ లో ఉంది. మొదటి రెండు పాటలు అంటే ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్, పవన్ కళ్యాణ్ మరియు నిత్యామీనన్ మధ్య వచ్చిన రొమాంటిక్ సాంగ్ కు భారీ స్పందన లభించింది. మూడో పాట ‘లాలా భీమ్లా’కి మరింతగా ఆదరణ లభించడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Read Also : బిగ్ బాస్-5 : డేంజర్ జోన్ లో ఆ పాపులర్ కంటెస్టెంట్ !
తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు సినిమా రన్‌టైమ్‌పై కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ దాదాపు మూడు గంటల (175 నిమిషాలు) నిడివితో ఉంది. ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్‌ప్లే రాస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ రీమేక్‌ను ప్రారంభించకముందే, తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో (తెలుగు వెర్షన్) చాలా మార్పులు చేశారు. దీని ప్రకారం ‘భీమ్లా నాయక్’ రన్ టైమ్‌ని అరగంట తగ్గించి, అనవసరమైన ఎపిసోడ్‌లను తీసి వేసి, ఇది పర్ఫెక్ట్ రెండున్నర గంటల సినిమా అవుతుంది. లాగ్‌లను తగ్గించడం వల్ల ఈ యాక్షన్ డ్రామా మరింత గ్రిప్పింగ్‌గా మారవచ్చు. పట్టుదల గల పోలీసు అధికారి, మాజీ సైనికుడి మధ్య జరిగిన ఇగో క్లాష్ ఈ చిత్రం. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే “భీమ్లా నాయక్” విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది.