హైదరాబాద్‌లో వరదలు, మురుగునీటి సమస్యలు, చెరువుల కబ్జాలు, పర్యావరణ సమస్యలు వంటి క్లిష్ట అంశాల పరిష్కారానికి ఒక ప్రత్యేక సంస్థ అవసరమని భావించిన ప్రభుత్వం, గత ఏడాది జూలైలో హైడ్రా (HYDRA) అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.
HYDRAA: హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.. ఎన్నో నిర్మాణాలను తొలగించిన హైడ్రా.. ఒవైసీ నడుపుతోన్న ఫాతిమా కాలేజీకి కూడా మార్క్ చేసింది.. అయితే, ఆ తర్వాత ఈ కాలేజీ విషయంలో వెనక్కి తగ్గిందనే విమర్శలు ఉన్నాయి.. దీనిపై హైడ్రాను టార్గెట్ చేశారు రాజకీయనేతలు.. ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే, సామాన్యులకు ఓ న్యాయం.. ఒవైసీకి మరో న్యాయమా అంటూ ఫైర్…
Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను హైడ్రా అధికారులు కూల్చేశారని.. ఆ తర్వాత నాగ్ రియలైజ్ అయి తమ్మిడికుంట చెరువుకోసం రెండెకరాలు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీజేఆర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. హైదరాబాద్ ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేదన్నారు. ఇష్టారీతిన చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్ల నీటిలో మునిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని క్లియర్…
చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే తమకు తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు హైడ్రా విజ్ఞప్తి చేసింది. కబ్జాలపై 8712406899 కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చని హైడ్రాధికారులు వెల్లడించారు. నగరంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు హైడ్రా చర్యలు తీసుకుంటుంది. నగరానికి వరద ముప్పు తప్పించాలంటే గొలుసుకట్టు చెరువులు కీలక పాత్ర పోషిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.
HYDRA : హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఫోకస్ పెట్టారు. తుర్కయాంజల్ చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. చెరువు తూములు మూసేసి అలుగు పెంచడంతో చెరువుపై భాగంలో పంటపొలాలు, ఇళ్ళు నీట మునుగుతున్నాయని స్థానికులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో నేరుగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలించారు హైడ్రా కమిషనర్. తుర్కయాంజల్ చెరువు FTL పైన వచ్చిన ఫిర్యాదులపై ఏవీ రంగనాధ్ పరిశీలన చేశారు.…
HYDRA : హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) కు తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. మంగళవారం, హైడ్రా కార్యాలయ నిర్వహణకు, వాహనాల కొనుగోలుకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా ఆవిర్భావం తరువాత జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని పలు చెరువులు, కుంటలు ఆక్రమణల నుండి విముక్తి పొందాయి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నగరంలోని పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ సంస్థ…
చందానగర్ డివిజన్ పరిధిలోని భక్షికుంట, రేగుల కుంట చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సందర్శించారు. తక్కువ నిధులతో ఈ చెరువులను అభివృద్ధి చేసిన తీరును క్షేత్ర స్థాయిలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఆనంద్ మల్లిగవాడ్ వివరించారు.