Allu Aravind : అలనాటి ఎవర్ గ్రీన్ మూవీ ముత్యాల ముగ్గు. ఈ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు అవుతోంది. దీన్ని బాపు డైరెక్ట్ చేశారు. ఇందులో కాంతారావు, సంగీత, అల్లు రామలింగయ్య, రావుగోపాల్ రావు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాను ముద్దలి వెంకటలక్ష్మి నరసింహారావు నిర్మించారు. నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మూవీ ఆత్మీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్ లాంటి వారు హాజరై మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి చాలా విషయాలను పంచుకున్నారు.
Read Also : Kannappa : కన్నప్పపై ట్రోల్స్ అందుకే రావట్లేదు.. విష్ణు కామెంట్స్
అరవింద్ మాట్లాడుతూ.. నాకు బాపు రమణ గారిని చూస్తే భయం వేసేది. ఎందుకంటే మా నాన్న గారు వారి గురించి ఇచ్చిన ఎలివేషన్ అలాంటిది. నా మైండ్ లో అలా ఉండిపోయేది. మా నాన్న దగ్గర డబ్బులు ఉంటే పట్టుకెళ్లి రమణ గారికి ఇచ్చేవారు. ఎందుకంటే ఆయన కంటే నమ్మకస్తుడు మా నాన్నకు ఇంకొకరు ఉండేవారు కాదు. అందుకే ఆయన్ను ఒక బ్యాంక్ లా చూసేవారు. ఇక బాపు గారు అంటే ఒక గురువు గారులా భావించేవారు మా నాన్నగారు. కోతిలాగా చేయాలని ఈ సినిమాలో మా నాన్నగారిని బాపు గారిని అడిగితే.. మా నాన్న నిజంగానే కోతిని చూసి అలాగే నటించారు. ఇప్పటికీ అది మనందరికీ గుర్తుండిపోయేది. జయకృష్ణ గారి ఇంట్లో బాపు, మా నాన్న, నేను కలిసేవాళ్లం. ఆ రోజుల్లో వారు గొప్ప మిత్రులుగా ఉండిపోయారు అంటూ వివరించారు అరవింద్.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి ఎవరైనా వెళ్లే ఛాన్స్.. ఇలా చేయండి చాలు..