ఓటీటీల పుణ్యామా అని ఇతర బాషలలోని సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అవకాశం దోరికింది. లాక్ డౌన్ కు ముందు పర బాషల సినిమాలను వీక్షీంచే వారి సంఖ్య చాలా తక్కువ. కానీ లాక్ డౌన్ లో ఓటీటీలలో తమిళ, మళయాల, కన్నడ సినిమాలను చూసే వార సంఖ్య గణనీయంగా పెరిగింది. మఖ్యంగా మళయాల సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు, సిరీస్ లు పాన్ ఇండియా బాషలో తెరకెక్కిస్తున్నారు దర్శకులు. ఇదిలా ఉండగా ఇటీవల తమిళ్ వచ్చిన ఓ వెబ్ సీరీస్ ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. తమిళ ప్రముఖ హస్య నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన ‘చట్నీ సాంబార్’ అనే ఈ వెబ్ సీరిస్ విశేషంగా అలరిస్తోంది. మరి ఆ చట్నీ, సాంబార్ రుచి ఎలా ఉందో తెలుసుకుందాం రండి..
కథ:
ఊటీలో అముదా పేరుతో ఉండే ఓ కేఫ్ . అక్కడ దొరకే సాంబార్ ఏంతో ఫేమస్. ఊటి అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు అముదా కేఫ్ లో సాంబార్ ఇడ్లీ తినకుండా ఎవరూ వెళ్ళరంటే అక్కడ దొరికే సాంబార్ టేస్ట్ గురించి న్యూస్ యాంకర్ చెప్పే షాట్ తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వత హోటల్ యజమాని బాబు తన ఇంటికి ఆ న్యూస్ యాంకర్ ను ఇంటికి పిలచి భోజనం వడ్డిస్తుండగా బాబుకు గుండే పోటు వస్తుంది. చనిపోయే ముందు అముదా కేఫ్ యజమాని తన కొడుకుని పిలిచి ఓ కోరిక కోరతాడు. అక్కడి నుండి కథ మలుపులు తిరుగుతుంది. ఎక్కడో చెన్నైలో టిఫిన్ షాప్ నడిపై సచిన్(యోజిబాబు) ఊటి ఎందుకు వచ్చాడు. అసలు సూఫీ ఎవరు. అక్కడ ఎటువంటి సమస్యను పరిష్కరించాడు అనేది మిగిలిన కథ..
విశ్లేషణ:
కథగా చెప్పకుంటే చట్నీ సాంబార్ ఒక సింపుల్ ఫామిలీ ఎమోషనల్ స్టోరి. కాని దర్శకుడు రాధామోహన్ ఈ సీరిస్ ను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. సింపుల్ స్టోరిని తన స్క్రీన్ ప్లేతో అధ్యంతం నవ్వులు పూయిస్తూ, కాసేపు మనసుని హత్తుకునే భావోద్వేగాలను మిళితం చేస్తూ, ఎక్కువ డ్రామా నడపకుండా సాఫీగా తీసుకువెళ్లాడు. మొత్తం 6 భాగాలుగా వచ్చిన ఈ సింపుల్ ఫీల్ గుడ్, ఫ్యామిలీ డ్రామా అక్కడక్కడా కొంచెం ప్రిడక్టబుల్ గా అనిపించినా ఎక్కడా బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా సాగింది. రాధామోహన్ గతంలో దర్శకత్వం వహించిన ఆకాశమంత సినిమా ఫ్లేవర్ అక్కడక్కడా కనిపించినట్టు అనిపిస్తుంది. కేవలం పది పాత్రల చుట్టూ తిరిగే కథ కావడంతో రిపీటెడ్ సిరీస్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఎంటైర్ సీరిస్ ఒక హోటల్ అక్కడి సాంబార్ టేస్ట్ ఆ సీక్రెట్ రెసీపీ ఏంటో అనేది ఎక్కడా చెప్పుకుండా ముగించాడు. అదే కాని చట్ని విషయంలో ఆ రెసిపీ ఏంటి అనేది రివీల్ చేసాడు. అముదా కేఫ్ యజమానికి మాత్రమే ఆ రెసిపీ తెలుసు అని ఫస్ట్ పార్ట్ లో దర్శుకుడు ఓ షాట్ లో చూపించాడు. మరీ ఆ క్యారక్టర్ చనిపోయాక ఆ హోటల్ లోని సాంబార్ అదే టేస్ట్ ఉన్నట్టు చివరి పార్ట్ లో చూపిస్తాడు. అది ఎలా సాధ్యమైందో ఆ లాజిక్ ఏంటో అర్ధం కాదు. సీరీస్ మెుత్తం ఊటి లోకేషన్లలో చిత్రీకరించడంతో ప్రతీ ప్రేమ్ అందంగా ఉంది. నేపధ్య సంగీతం పర్వాలేదు. ఇక ఈ సీరీస్ లో ప్రత్యేకంగా డైలాగ్ రైటర్ ను మెచ్చనకుని తీరాలి. ఒక సింపుల్ సీన్ ను కూడా షాట్ పంచులతో నెక్ట్స్ లెవల్ కు తీసుకు వెళ్లాడు.
నటీనటుల ప్రదర్శన ::
ఈ సీరీస్ మెుత్తాన్ని మోగిబాబు తన భుజాలపై మోసాడు. తనదైన కామెడీ టైమింగ్ తో, హావ భావాలతో, తనకు మాత్రం సొంతమైన బాడీ లాంగ్వేజ్ తో యోగిబాబు వన్ మ్యాన్ షో చేసాడు. మరో నటుడు ఎలంగో తన పాత్రలో తన పరిధి మేరకు నటించి మెప్పించాడు. సూఫీ పాత్రలో నటించిన వానీ భోజన్ అద్భతంగా నటించింది. యోగిబాబు తర్వాత ఈ సిరీస్ లో ఆమెదే ముఖ్య పాత్ర. మిగిలిన వారు తమ తమ పరిధి మేరకు మెప్పించారు.
Also Read : Devara: రికార్డు స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తోన్న దేవర సెకండ్ సింగిల్
బోటమ్ లైన్ :: చట్నీ-సాంబార్ ‘ఆహా.. ఏమిరుచి.. అనరా.. మైమరచి’ అనాల్సిందే..