టెలివిజన్‌లో యాడ్స్ ద్యారా కెరీర్‌ని మొదలుపెట్టి, హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ఆ తర్వాత ‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రజంట్ హిందీలో వరుస సినిమాలు , సిరీస్‌లు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియా కారణంగా సెలబ్రెటిలు జనాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని వారి అభిమానులతో పంచుకుంటున్నారు. కానీ యామీ గౌతమ్ మాత్రం సోషల్ మీడియా విషయంలో అందరికంటే పూర్తి భిన్నంగా ఉంది.
Also Read: Ram Charan : ‘RC 16’ కోసం ‘కరుణడ చక్రవర్తి’ శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ ఫినిష్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యామీ.. ‘చాలామంది సెలబ్రిటీలు వారి జీవితాల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నాకు సోషల్ మీడియా అకౌంట్ ఉంది. కానీ నేను బ్రేక్ ఫాస్ట్ చేశాను.. డిన్నర్ చేశాను, జిమ్‌ల్లో గాయపడ్డాను. ఇలాంటి చిన్న చిన్న విషయాలను అందరితో షేర్ చేసుకోను. నాకు నా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పుకోవడం నచ్చదు. అంత అవసరం కూడా లేదని నా అభిప్రాయం. నా గురించి ప్రజలు ఆలోచించాలని నేను కోరుకోవడం లేదు. వాళ్లకు ఎంత తక్కువ తెలిస్తే నేను పోషించే పాత్రకు ప్రేక్షకులు అంత ఎక్కువ కనెక్ట్ అవుతారు. అదే నా ఆలోచన’ అని చెప్పుకొచ్చింది.