ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్‌గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూవీస్‌ని ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ రైట్స్ కొనలేదు. జీబీయు సక్సెస్‌తో అజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. ఇక రెట్రో సంగతి సరే సరి. థియేటర్లలోనే డిజాస్టర్ గా నిలిచింది రెట్రో.
Also Read : Sriram case : డ్రగ్స్ కేసులో మరో హీరో..
గుడ్ బ్యాడ్ అగ్లీ, రెట్రోను భారీగా వెచ్చించి ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. రెట్రో రూ. 80 కోట్లు, జీబియు 95 కోట్లకు OTT రైట్స్ అమ్ముడయ్యాయి. కానీ ఈ రెండు సినిమాలకు బిగ్ హ్యాండ్ ఇచ్చింది ప్రముఖ ఛానెల్ సన్ టీవీ. జీబీయూని ఫస్ట్ సన్ టివీ శాటిలైట్ రైట్స్ అగ్రిమెంట్ చేసుకుంది. తీరా సినిమా రిలీజయ్యాక డీల్ క్యాన్సిల్ చేసింది. రెట్రో విషయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. దీంతో అన్ సో’ల్డ్ చిత్రాలుగా మిగిలిపోయాయి. స్టార్ హీరోల చిత్రాల శాటిలైట్స్ రైట్స్ సోల్డ్ కాకపోవడానికి ఓటీటీ మాత్రమే కారణం కాదు. థియేటర్లలో సినిమా సరిగ్గా ఆడకపోయినా, పెద్దగా బజ్ క్రియేట్ చేయకపోయినా టీవీ ఛానల్స్ భారీగా ఖర్చుపెట్టడానికి ఆలోచిస్తున్నాయి. అలాగే సినిమా విడుదలైన ఎప్పటికో టీవీల్లో చూసేందుకు నిరీక్షించడం లేదు ఆడియన్స్. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీల్లోకి రావడం అంతకన్నా ముందే పైరసీ రూపాల్లో చూసేయడం కూడా శాటిలైట్స్ ఛానల్స్‌కి నష్టాన్ని చేకూరుస్తున్నాయి. భారీ రేటుకు కొన్న ఒక్కసినిమాకి కూడా సరైన రేటింగ్ రాకపోవడం సదరు ఛానల్స్‌కి పేద్ద హేడేక్‌గా మారింది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే భవిష్యుత్తులో సినిమాలు అనేవి టీవీల్లో చూడడం అనేది వండర్ అవుతుంది.