మోహన్ లాల్ కూతురు విస్మయ మలయాళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. జూడ్ ఆంథోనీ డైరెక్షన్లో ‘తుడక్కుమ్’ అనే సినిమాతో విస్మయ తన సినీరంగ ప్రవేశం చేస్తోంది. 2018 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత జూడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మోహన్ లాల్ అనుచరుడు ఆంటోనీ పెరంబవూర్ ఆధ్వర్యంలోని ఆశీర్వాద్ సినిమాస్ 37వ సినిమాగా విస్మయ మోహన్ లాల్ తొలి చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే జూడ్ రాశారు. కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తర్వాత మోహన్ లాల్ కుమార్తె విస్మయ కూడా ఈ సినిమాలో నటిస్తోంది.
Also Read:Mahavatar Narsimha: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో
ఇక ఈ క్రమంలో తన కుమార్తెకు మోహన్ లాల్ ఆహ్వానం సోషల్ మీడియా వేదికగా పలికారు. “ప్రియమైన మాయకుట్టి, ‘తుడక్కుమ్’ అనేది జీవితాంతం సినిమాతో ప్రేమలో పడటానికి తొలి అడుగు మాత్రమే” అని మోహన్ లాల్ ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. నిజానికి సినీ రంగప్రవేశానికి ముందే విస్మయ మోహన్ లాల్ కి కళారంగంతో అనుబంధ ఉంది. 2021 లో ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్ డస్ట్’ అనే కవితా సంకలనాన్ని ఆమె రాసి విడుదల చేశారు. ఆ కవితా సంకలనం కేరళ నాట చాలా మంది దృష్టిని ఆకర్షించింది. తరువాత ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్ డస్ట్’ మలయాళంలోకి ‘నక్షత్రధూళికల్’ గా అనువదించబడింది. రచన , దర్శకత్వంతో పాటు, విస్మయకు పెయింటింగ్ పై కూడా ఆసక్తి ఉంది. విస్మయ గీసిన చిత్రాలు సోషల్ మీడియాలో చాలా దృష్టిని ఆకర్షించాయి. అంతేకాదు విస్మయకి థాయ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా అనుభవం ఉంది.