Dhamki First Look: నవతరం కథానాయకుల్లో వచ్చీ రాగానే సందడి చేసిన హీరో విశ్వక్ సేన్ అనే చెప్పాలి. రెండు సినిమాల్లో నటించాడో లేదో, మూడో చిత్రానికే మెగాఫోన్ పట్టేసి డైరెక్టర్ అయిపోయాడు విశ్వక్ సేన్. తన సినిమాల టైటిల్స్ విషయంలోనూ వైవిధ్యం చూపిస్తూ సాగుతున్నాడు విశ్వక్. వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా పరిచయమైన విశ్వక్‌సేన్ ఈనగరానికి ఏమైంది అనే చిత్రంతో యూత్ కు బాగా దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన ఫలక్ నుమా దాస్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకొని మాస్ కా దాస్ గా మారిపోయాడు. అప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఇప్పుడు దాస్ కా ధమ్కీ అనే సినిమా కోసం విశ్వక్ మరోసారి మెగా ఫోన్ పట్టారు. టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించగా.. నివేదా పేతురాజ్ సహనటిగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఫస్ట్ లుక్ ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. అంగమాలి డైరీస్‌కి రీమేక్ అయిన ఫలక్‌నుమా దాస్ తర్వాత ఆయన టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ఇది.అతని మునుపటి చిత్రాలైన పాగల్, అశోక వనం లో అర్జున కళ్యాణంలో అతను పోషించిన పక్కింటి అబ్బాయి పాత్రల తర్వాత నటుడిని మళ్లీ మాస్ అవతార్‌లో చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.
Read also: Crime news: దారుణం.. నడిరోడ్డుపై కారంచల్లి కత్తులతో పొడిచి..
హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నిర్మాణ ఫార్మాలిటీస్ వారం చివరిలోగా పూర్తవుతాయి. ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దీపావళి కానుకగా అందించాలని భావించారు కానీ కుదరలేదు. ఈరోజే తాజాగా ఈ ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించారు. విశ్వక్ సేన్ కనుబొమ్మలు ఎగరేస్తూ.. ధమ్కీ ఇస్తున్నట్లు వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ప్రీ టుక్ పోస్టర్ లో విశ్వక్ సేన్ బ్యాక్ సైడ్ టుక్ ని చూపించగా.. అయితే ఇప్పుడు రివీల్ చేసిన ఈపోస్టర్‌లో యువ హీరో విశ్వక్ సేన్ లైట్ గా గడ్డం, చెవిపోగులు, గోల్డ్ వాచ్, ట్రెండీ హెయిర్ స్టైల్ పూర్తిగా రగ్గడ్ లుక్‌లో కనిపించాడు. డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఈ పోస్టర్ కనిపించడంతో.. ధమ్కీ పోస్టర్ సూపర్ అంటూ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. అయితే.. ‘దాస్ కా ధమ్కి’ అనేది హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్. అందులో ఒకటి హీరో రోల్ కాగా.. మరొకటి విలన్ రోల్ అని అంటున్నారు. విశ్వక్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. రోహిణి – రావు రమేశ్ – పృథ్వీరాజ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read also: Danushka Gunathilaka: లైంగిక దాడి కేసులో లంక క్రికెటర్ గుణతిలకకు బెయిల్
RRR, హరి హర వీర మల్లు వంటి చిత్రాలకు స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్, జుజీ ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ ఫైట్‌కు పనిచేశారు. వెంకట్ మాస్టర్‌తో పాటు బింబిసారలో పనిచేసిన రామకృష్ణ మాస్టర్‌ని కూడా యాక్షన్ ఎపిసోడ్ కోసం తీసుకున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, అన్వర్ అలీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రాఫర్. ప్రధాన నటీనటులతో పాటు, ఫిబ్రవరి 2023లో తమిళం, మలయాళం మరియు హిందీలో కూడా విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి , పృథ్వీరాజ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే.. “ధమ్కీ” మూవీ విశ్వక్ సేన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
No Alerts🚨Only #Dhamki 👊🏾
Presenting the First Look of Mass Ka Das @VishwakSenActor’s #DasKaDhamki ❤️🔥#DhamkiFirstLook 💥
Feb 2023🔥 Worldwide Release in theatres
ధమ్కీ – धमकी – தம்கீ – ധംകി@Nivetha_Tweets #KarateRaju @KumarBezwada @leon_james @VanmayeCreation @VScinemas_ pic.twitter.com/m8HVXKSMWP— VishwakSen (@VishwakSenActor) November 17, 2022