Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ తనదైన అగ్రెసివ్ స్టైల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తన పరాజయాలను చూసి సంబరపడిన విమర్శకులపై విజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచాయి. గతంలో తన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడనప్పుడు తనను టార్గెట్ చేసిన వారిని విజయ్ గట్టిగానే హెచ్చరించాడు. “‘నోటా’ సినిమా ఫ్లాప్ అయినప్పుడు కొందరు కావాలనే నా వైఫల్యాన్ని ఎంజాయ్ చేశారు. నా ఫెయిల్యూర్‌ను నాకే రుద్దుతూ సంబరపడ్డారు. ఆ సమయంలో నా ఈగో చాలా హర్ట్ అయింది. అప్పుడే అందరికీ ఓ బహిరంగ లేఖ రాశా.. ‘ఐ విల్ బి బ్యాక్’ అని ప్రామిస్ చేశా. ఆ తర్వాత ‘టాక్సీవాలా’తో హిట్ కొట్టి నా సత్తా చాటా. ఆ సక్సెస్ మీట్లో గర్వంగా ‘ఐ యామ్ బ్యాక్’ అని కాలర్ ఎగరేసి చెప్పా. ఇప్పుడు మళ్లీ అదే కసితో, అదే కాన్ఫిడెన్స్‌తో ‘రణబాలి’తో వస్తున్నా. ఈసారి మనం అనుకున్నది జరిగిందంటే.. నేరుగా అనంతపూర్ గడ్డ మీదకు వచ్చి మళ్లీ నా సక్సెస్ ఏంటో వాళ్లందరికీ గుర్తుచేస్తా” అంటూ ట్రోలర్స్‌కు, యాంటీ ఫ్యాన్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.
ఇక తన లక్కీ ఛార్మ్, కో-స్టార్ రష్మిక మందన్నాపై విజయ్ కురిపించిన ప్రేమ, ప్రశంసలు అభిమానులను ఫిదా చేశాయి. “రష్మిక.. నువ్వు నా ఫేవరెట్ కో-స్టార్. నీతో పనిచేస్తుంటే నాకు ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది. నీ వర్క్ డెడికేషన్ చూస్తే అప్పుడప్పుడు మనిషివి కాదేమో, అలుపెరగకుండా పనిచేసే రోబోవేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో ‘జయమ్మ’ పాత్రకు నువ్వు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ రష్మికపై తనకున్న స్పెషల్ బాండింగ్‌ను, ఆరాధనను వేదికపైనే బయటపెట్టాడు. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఒక బలమైన, ఎవరూ చెప్పని చరిత్ర ఉందన్నాడు విజయ్. 150 ఏళ్ల క్రితం వచ్చిన మహా కరువు (మద్రాస్ ఫ్యామిన్), సూపర్ ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిపాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికలను గుర్తు చేస్తూ.. భవిష్యత్తులో రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్, ఆహారాన్ని పొదుపుగా వాడుకోవాలని తన బాధ్యతగా సామాజిక సందేశాన్ని కూడా ఇచ్చాడు.
Also Read
- Rashmika : "పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!"
- Rahul Sankrityan : విజయ్ - రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
- JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
- Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు, అజయ్-అతుల్ అందించిన క్లాసిక్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని కితాబిచ్చాడు. మొత్తానికి, విమర్శకుల నోళ్లు మూయించడానికి ‘రణబాలి’ రూపంలో విజయ్ దేవరకొండ ఒక పెద్ద అస్త్రంతోనే రాబోతున్నాడని ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అక్టోబర్ 16న బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయమంటూ రౌడీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!