Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశాలతో వస్తోన్న హారర్ కామెడీ చిత్రాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పాట ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్ఎల్టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మాణంలో, వై.జి. భరత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్, హారర్ కామెడీ థ్రిల్లర్ ‘పర్ణశాల’. వినూత్న ప్రచార వ్యూహాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ‘జిమ్ జిమ్ తార’ పూర్తి పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి జి. లక్ష్మిదేవి స్వయంగా రాసి, తన మ్యాజికల్ వాయిస్‌తో ఆలపించిన ‘జిమ్ జిమ్ తార’ గీతం ఇప్పటికే నెట్టింట వైరల్ సెన్సేషన్‌గా మారింది. తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పూర్తి పాట అధికారికంగా విడుదల కావడంతో, సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరాయి. సాంగ్ ప్రోమోలు లేదా చిన్న బిట్స్ రాకముందే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన ఈ పాటకు.. ఇప్పుడు ఫుల్ వెర్షన్ వచ్చాక ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది.
Also Read
సాధారణ ప్రేక్షకుల నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే కంటెంట్ క్రియేటర్ల వరకు అందరూ ఈ పాటకు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీలు సైతం తమ సోషల్ మీడియా హ్యాండ్స్‌లో ఈ పాటను వాడేస్తుండటంతో ఇది కాస్తా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా దర్శకుడు వై.జి. భరత్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ అపూర్వ స్పందన తమ యూనిట్‌కు మరింత జోష్‌నిచ్చిందని, సినిమాపై అంచనాలను ఇది రెట్టింపు చేసిందని తెలిపారు.
హారర్ కామెడీ జోనర్‌కు సరికొత్త సరిహద్దులు అద్దేలా రూపొందుతున్న ‘పర్ణశాల’ చిత్రంలో బలమైన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. మొత్తానికి ‘జిమ్ జిమ్ తార’ మానియా చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే!
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!