విజయ్ దేవరకొండ హీరోగా ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ‘లైగర్’ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు. విజయ్ దేవరకొండ పుట్టినరోజు అయిన మే 9న ‘లైగర్’ టీజర్ విడుదల చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో టీజర్ రిలీజ్ కరెక్ట్ కాదని యూనిట్ భావించింది. అందుకే ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. పవర్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరిస్థితులు కుదట పడ్డాక టీజర్ రిలీజ్ ఉంటుందంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ భయానకంగా ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే అందరూ వాక్సిన్ వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని హీరో విజయ్ దేవరకొండతో పాటు పూరి అండ్ టీమ్, ధర్మ ప్రొడక్షన్స్ కోరుతున్నారు.