ధమాకా, మజాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా ‘చౌర్య పాఠం’. క్రైమ్-కామెడీ డ్రామాగా తెరెకెక్కుతోన్న ఈ చిత్రంతో ఇంద్రా రామ్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కన్నడ భామ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది.
నిఖిల్ గొల్లమారి అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. రాజీవ్ కనకాల, మస్త్ అలీ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ నుంచి గతంలో విడుదలైన టీజర్ కు మంచి స్పందన లభించింది.
ఇక ఇప్పడు లేటెస్ట్ గా ఈ సినిమాలో ఒక్కసారిగా అని సాగె లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. యంగ్ హీరో వరుణ్ తేజ్ కొణిదెల ఈ సాంగ్ ను రిలీజ్ చేసారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సాంగ్ ను కృష్ణ కాంత్ రచించగా సెన్సషనల్ సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. వినసొంపైన లిరిక్స్ అంటే అద్భుతమైన లొకేషన్స్ చిత్రీకరించిన ఈ సాంగ్ సూపర్ గా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కార్తీక ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది. ఇంద్ర రామ్ డాన్స్ మెప్పించింది. విభిన్నమైన కథతో వస్తున్న చౌర్యపాఠం ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన నక్కిన నిర్మాతగా ఎటువంటి హిట్ ఇస్తాడో మరి కొద్దీ రోజుల్లో తెలియనుంది.