దసరా కానుకగా అన్ని భాషలు కలిపి అరడజను సినెమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘ వేట్టయాన్’ అందరికంటే ముందుగా అక్టోబరు 10న పాన్ ఇండియూ బాషలలో రిలీజ్ కానుంది. జైలర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు వస్తోంది గోపించంద్ శ్రీనువైట్లల విశ్వం. ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. వీరిద్దరికి ఈ సినిమా హిట్ కావడం అనేది చాలా కీలకం. 11న రిలీజ్ అవుతున్ మరో సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’. వరుస ప్లాప్స్ కొడుతూ వస్తున్న సుధీర్ బాబుకు ఈ సినిమా కీలకం. అలాగే సుహాస్ నటించిన జనక అయితే గనక మంచి బజ్ తో రిలీజ్ కాబోతుంది.
Also Read : Devara : తెలంగాణ – ఏపీ దేవర 12వ రోజు కలెక్షన్స్.. డీసెంట్..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాలకు వరుణ గండం పొంచి ఉంది. అక్టోబరు 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు ఉండనున్నాయి వరుసగా మూడు తుపాన్లు ముప్పు పొంచి ఉండొచ్చు ఉన్నాయని.వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. అదే జరిగితే మాత్రం సినిమాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అసలే రాబోతున్న సినిమాల పట్ల ఆయా హీరోలు చాల నమ్మకంగా ఉన్నారు. తమకు హిట్ దక్కుతుందని భావిస్తున్నారు. మొన్నామధ్య కురిసిన వర్షాల కారణంగా నాని నటించినసరిపోదా శనివారం కలెక్షన్స్ పై కొన్ని ఏరియాలలో తీవ్ర ప్రభావం చూపాయి. కొందరికి నష్టాలు కూడా మిగిల్చాయి. ఇప్పుడే అదే భయం రానున్న సినిమాల నిర్మాతలను కలవరపెడుతుంది. వరుణుడి ప్రభావం ఏ మేరకు ఉంటుందో కొద్ది రోజుల్లో తెలుస్తుంది.