Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
- మాలీవుడ్ భామలపై టాలీవుడ్ కాన్సట్రేషన్
- ఈ ఇయర్ కూడా నయా కేరళ కుట్టీలు
- ఎంత మంది సక్సెస్ అందుకున్నారంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ తర్వాత మాలీవుడ్ భామలపై ఎక్కువ కాన్సట్రేషన్ చేస్తూ ఉంటుంది టాలీవుడ్. ఊ అంటే.. మాలీవుడ్ హీరోయిన్లను పట్టుకొచ్చి లైఫ్ ఇస్తుంటారు మన ఫిల్మ్ మేకర్స్. ప్రతి ఏడాది లాగానే ఈ ఇయర్ కూడా నయా కేరళ కుట్టీలు టాలీవుడ్లోకి లక్ టెస్ట్ చేసుకునేందుకు వచ్చారు. ఆ హీరోయిన్స్ ఎవరు?, ఎంత మంది సక్సెస్ అందుకున్నారో చూద్దాం.
ఇవానా:
ఈ ఏడాది కూడా మాలీవుడ్ హీరోయిన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టాలీవుడ్ తలుపు తట్టారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ఇవానా. ‘లవ్ టుడే’తో డైరెక్ట్‌గా తమిళ ఆడియన్స్‌కు చేరువై.. డబ్బింగ్ వర్షన్‌తో మనకు పరిచయమైంది ఇవానా. ఈ సక్సెస్ ఆమెకు టాలీవుడ్ అవకాశాలను తెచ్చిపెట్టాయి. శ్రీవిష్ణు ‘సింగిల్’ మూవీతో తెలుగులో డెబ్యూ ఇచ్చిన ఇవానా.. సాలిడ్ హిట్ అందుకుంది.
Also Read
మాళవిక మనోజ్:
జోతో పాపులరైన మలయాళ కుట్టీ మాళవిక మనోజ్.. సుహాస్ మూవీ ‘ఓ భామ అయ్యోరామ’తో టాలీవుడ్లో సెటిల్ అవ్వాలనుకున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సినిమా డిజాస్టర్ కావడంతో మళ్లీ కోలీవుడ్, మాలీవుడ్ చెక్కేసింది.
దర్శనా రాజేంద్రన్:
దర్శనా అంటూ మలయాళీ యూత్ హృదయాలను కొల్లగొట్టిన దర్శనా రాజేంద్రన్.. ‘పరదా’తో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకుందామని ప్రయత్నిస్తే బొమ్మ అండర్ ఫర్ఫామెన్స్ చేసింది. దాంతో ఆమె ఆశలు గల్లంతు అయ్యాయి.
అనస్వర రాజన్:
ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులతో టచ్‌లోకి వచ్చిన మరో మలయాళ సోయగం అనస్వర రాజన్. ‘ఛాంపియన్’తో మెరిసిన అనశ్వర.. కట్టుబొట్టుతోనే కట్టిపడేసింది. అనస్వరకు టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు రావడం పక్కా. యువ హీరోలకు ఆమె మంచి చాయిస్ అనే చెప్పాలి.
మాళవిక మోహనన్:
ఇక అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. మరో కేరళ బ్యూటీ మాళవిక మోహనన్ కూడా ఈ ఏడాదే రాజా సాబ్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేదే. కానీ బొమ్మ నెక్ట్స్ ఇయర్ పోస్ట్ పోన్ కావడంతో డెబ్యూ డిలే అవుతోంది. ఈ నలుగురు భామల్లో ఇవానా, అనస్వర హిట్ కొడితే.. మాళవిక, దర్శనా ఫ్లాప్స్ చూశారు. ఏదేమైనా ఈ నలుగురు టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు.
తాజావార్తలు
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!