Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
- వెంకట్రామయ్య గారి తాలూకా టీజర్ ఆవిష్కరణ
- వెండితెరకు పరిచయం అవుతున్న దినేష్ కుమార్, దివిజ
- జూలై 18న థియేటర్లలో సినిమా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ సినిమా టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సందడి చేసింది. హీరోగా దినేష్ కుమార్, హీరోయిన్ దివిజ ప్రభాకర్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్నారు. సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మానవ సంబంధాలు, తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్ వంటి భావోద్వేగ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రతి కుటుంబాన్ని ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను హృద్యంగా ఆవిష్కరించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘జయమ్మ పంచాయితీ తర్వాత నేను చేసిన మరో మంచి సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఇందులో ఉంది. ముఖ్యంగా పాటలు ఈ సినిమాకు ప్రాణం. ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే చిత్రం అవుతుంది’ అని అన్నారు. హీరోయిన్ దివిజ మాట్లాడుతూ.. ‘అందరికీ నచ్చే కథ ఇది. ప్రతి ఒక్కరూ ఎంతో మనసుపెట్టి పని చేశారు. నిర్మాత కోమలి గారు ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 18న థియేటర్లలో ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
వెంకట్రామయ్య గారి తాలూకా చిత్రంలో మురళీధర్ గౌడ్, సుధ, సీనియర్ నటుడు కాశి విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ, హాసిని, యూట్యూబర్స్ జీవన్ప్రియ, గౌరి నాయుడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను సతీష్ ఆవాల నిర్వహించగా.. చరణ్ అర్జున్, చిరంజన్ సంగీతం అందించారు. కుటుంబ విలువలను హృద్యంగా చెప్పే ఈ చిత్రం ప్రేక్షకులకు భావోద్వేగ అనుభూతిని అందించనుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?