స్టార్ హీరో నాని ప్రజంట్ వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాలో ‘ది ప్యారడైజ్’ ఇకటి. ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సెకండ్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ లాంటి విదేశీ భాషల్లోనూ ఒకేసారి, విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కాగా, ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని, ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ పై పలు షాకింగ్ పుకార్లు వినిపించడం మొదలయ్యాయి, దీంతో తాజాగా మూవీ టీం స్పందించింది..
Also Read: MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్ కోసం వస్తున్న NTR
ఈ మధ్యకాలంలో సినిమాల పై పుకార్లు పుటించడం మరి ఎక్కువ అవుతుంది. ఎలాంటి అప్ డేట్ లేనప్పటికి వారికి ఇష్టం వచ్చిన వార్తలు వైరల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి ఫెక్ న్యూస్ లే నాని ‘ది ప్యారడైజ్’ మూవీ పై కూడా మొదలయ్యాయి. దీంతో రీసెంట్‌గా మూవీ టీం ‘కొంతమంది బడ్జెట్ లేక మా సినిమా ఆగిపోతుంది అని పలు రూమర్స్ వైరల్ చేస్తున్నారు. మా సినిమాపై ఇలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న జోకర్స్ అందరికీ సమాధానం తమ సినిమా తోనే చెప్తాము. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారు అందరికీ కూడా సమయం దగ్గర్లోనే ఉంది’ అంటూ ఘాటు రిప్లై ఇస్తూ.. చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు.