తెలుగు సినీ పరిశ్రమలో ఓ మాదిరి పెద్ద సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా, బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, ప్రభాస్ రాజా సాబ్ ఈ ఏడాదిలో రిలీజ్ కావలసిన మిగతా పెద్ద సినిమాలు. అయితే ఈ సినిమాల విడుదల తేదీల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
Also Read: Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా??
నిజానికి విశ్వంభరా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. గేమ్ చేంజర్ కోసం వెనక్కి వెళ్లామని చెబుతున్నా సరే, సీజీలు లేట్ అవడంతో సినిమా వాయిదా పడింది. ప్రజెంట్ సమాచారం మేరకు అది సెప్టెంబర్ 18వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఇక సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ అఖండ 2 సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అఖండ 2 డిసెంబర్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం అయితే పెద్దగా జరుగుతోంది. అయితే అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో అనేది ఇప్పటికీ చెప్పలేం.
Also Read:Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా పవన్ తో ఒక్క సినిమా చేసినా ఒకటే!
ఇక తాజాగా సంక్రాంతికి ప్రభాస్ రాజా సాబ్ వాయిదా పడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆ సినిమా కూడా ఎన్నోసార్లు రిలీజ్‌కి సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తామని చివరిగా ప్రకటించారు. కానీ ఆ టైంకి రావడం కష్టమేనని కాబట్టి సంక్రాంతికి పుష్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక రకంగా ఇదంతా గందరగోళ పరిస్థితి అని చెప్పాలి. నిజానికి ఏ విషయాన్ని నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం జరుగుతున్నదంతా ప్రచారమే కావడంతో, ఆయా నిర్మాణ సంస్థలు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు సినిమా వాయిదా పడిందనుకోవాలి, తప్ప అప్పటివరకు మిగతావన్నీ ఊహాగానాలే.