తెలుగు సినిమా స్థాయి పెరిగింది. టాలివుడ్ నుండి ఏదైనా సినిమా వస్తుందంటే ఎవరు ఏంటి అనే ఆరాలు దగ్గరనుండి ఏ రేట్ పెట్టి కొనుగోలు చేయాలని డిస్కషన్ అటు తమిళ్, కేరళ, కన్నడ, హింది చిత్ర పరిశ్రమ బిజినెస్ సర్కిల్స్ లో జరుగుతుంది. తెలుగుసినిమాలు ఇతర భాషలలో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతన్నాయి. కాగా ఇప్పడు టాలీవుడ్ కు చెందిన రెండు సినిమాలను తమిళ్ లో భారీ ధరకు కొనుగోలు చేసారు.
Also Read : NTRNeel : ప్రశాంత్ నీల్ సినిమాకు Jr. NTR దూరం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తోలి బాలీవుడ్ సినిమా వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య వస్తున్న వార్ 2 ఈ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి లీడ్ రోల్ లో వస్తున్న చిత్రం ఘాటీ. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా జులై 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు ఈ రెండు సినిమాల తమిళ థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ చేసారు. అటు ఎన్టీఆర్ సినిమాను ఇటు అనుష్క సినిమా కోలీవుడ్ రైట్స్ ను తమిళనాడు కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ థింక్ స్టూడియోస్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ రెండు సినిమాలకు తమిళ్ లో భారీ ఎత్తున రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.