యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు.
Also Read : Coolie : ఆల్ టైమ్ రికార్డ్ ధరకు ‘కూలీ’ తెలుగు రైట్స్..
అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు ఎన్టీఆర్ దూరంగా ఉండబోతున్నాడు. అందుక్కారణం వార్ 2. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. భారీ అంచనాల మధ్య వస్తున్నా వార్ 2 ఈ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు ప్రశాంత్ నీల్ సినిమాకు ఎన్టీఆర్ బ్రేక్ ఇవ్వబోతున్నాడు. దాదాపు నెల రోజుల పాటు వార్ 2 ప్రమోషన్స్ కు కేటాయించి నీల్ సినిమాకు విరామం ప్రకటించబోతున్నాడు. అందుకు అనుగుణంగా తారక్ లేని సీన్స్ ను ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెకుతున్న డ్రాగన్ ను నెవర్ బిఫోర్ అనే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.