ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలామంది నటీనటులు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఎదుర్కొనే సవాళ్లు, అవమానాలు మరింత ప్రత్యేకమైనవిగా ఉంటాయి. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు సంఘటనను బయటపెట్టింది.
Also Read : Sakshi Malik : హీరోయిన్ పై కొరియోగ్రాఫర్ దాడి..!
“నేను ఇండస్ట్రీకి చాలా చిన్న వయసులో వచ్చాను. చాలా మందికి అప్పుడు నాకేం తెలియదని భావించేవారు. నన్ను హర్ట్ చేయాలని.. నా విశ్వసాని పోగోటాలని చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి ఓ పెద్ద సౌత్ స్టార్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. అయితే కొన్ని సీన్స్ చిత్రీకరణ సమయంలో నాకు అసౌకర్యంగా అనిపించింది. డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు నేను ఇబ్బందిగా ఉన్నట్టు చెప్పాను. వెంటనే ఆ స్టార్ హీరో నాపై కోపంగా స్పందించి, ‘హీరోయిన్ మార్చండి’ అంటూ అందరి ముందే అరవడం జరిగింది. ఎవరైనా మనల్ని అవమానించారని బాధపడుతూ మనం కూడా తిరిగి వాళ్లతో అలా ప్రవర్తించకూడదని మౌనంగా ఉన్నాను. ఆయన మాత్రం ఆరోజు సెట్‌లోనే అందరి ముందు పెద్దగా కేకలు వేశాడు. మరుసటిరోజు తనంతటతానే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. తనకు కోపం వచ్చిందని అందుకే అరిచినట్లు తెలిపాడు. నాతో అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపపడ్డాడు’ అని తమన్నా తెలిపారు. కానీ ఇంతకి ఆ బిగ్ సౌత్‌స్టార్ పేరు మాత్రం ఆమె చెప్పలేదు. మొత్తనికి ఆ హీరో పేరు చెప్పకపోయినా, తమన్నా ఓ ఆయన తన తప్పును గ్రహించి మానవత్వంతో క్షమాపణలు చెప్పడాన్ని హైలైట్ చేశారు. ఇది ఆమె వ్యక్తిత్వాన్ని, తాను చూపిన సహనాన్ని సూచించే సంఘటనగా చెప్పొచ్చు.