మ్యూజిక్ వీడియోలు, మోడలింగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ముంబై బ్యూటీ సాక్షి మాలిక్, తన గ్లామర్, ఫిట్‌నెస్, ఫ్యాషన్ సెలెక్షన్‌తో సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ‘బోమ్ డిగ్గీ డిగ్గీ’ పాట ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయాల్ ఆమె చెంప చెళ్లుమనిపించినట్లు కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందిస్తూ.. ‘ఇది అవసరం లేని ఆగ్రహం ప్రదర్శన’ అంటూ రాఘవ్ పై విమర్శలు గుప్పించారు. అయితే ఈ వీడియో గురించి సాక్షి మాలిక్ స్పందిస్తూ, ‘అది యాక్టింగ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో మాత్రమే. నిజంగా ఎవ్వరినీ హర్ట్ చేయాలని ఉద్దేశం లేదు’ అంటూ క్లారిటీ ఇచ్చింది.
Also Read : Mothevari : మోతెవరి లవ్ స్టోరీ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
మరోవైపు, ఈ వీడియోను పబ్లిసిటీ కోసం ప్రణాళికాబద్ధంగా విడుదల చేశారా? అనే కోణంలో కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ’ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ అవసరం లేదు’ అంటూ కామెంట్స్ చేయడం కనిపిస్తుంది. అయినా, సాక్షి మాలిక్ మాత్రం తన స్పష్టతతో ఈ వివాదాన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే, సాక్షి టీవీ కమర్షియల్స్, మ్యూజిక్ వీడియో తో పాటు, కొన్ని సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. 2020 లో విడుదలైన ‘వి’ చిత్రంలో ఆమె ఫోటోను అనుమతి లేకుండా వాడినందుకు బాంబే హైకోర్టును ఆశ్రయించి, కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, ఆమె లీగల్ అవేర్‌నెస్‌కు నిదర్శనం.