Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఆ సినిమా సూపర్ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన అఖిల్ సినిమాల ఎంపికను పూర్తిగా చేంజ్ చేశాడు. కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో తర్వాతి సినిమాలపై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు నిఖిల్.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ప్రజెంట్ నిఖిల్ చేతిలో స్వయంభు, ద ఇండియా హౌజ్ చిత్రాలున్నాయి. ఈ రెండు కూడా పీరియడిక్ చిత్రాలే. వాటిలో స్వయంభు సినిమాను దాదాపు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా స్వయంభు వస్తుందని స్వయంగా నిఖిల్ తెలిపాడు. ఇక ఈ సినిమా కోసం కత్తి యుద్దాలు గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు. చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా గురించి గత కొంత కాలంగా ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఎంత వరకు వచ్చింది, షూటింగ్ ఫినిష్ అయిందా లేదా అని ఎలాంటి సమాచారం లేదు. ఫైనల్ గా ఇప్పుడు స్వయంభు అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఫ్రిబ్రవరి 13న స్వయంభు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టనుందని ప్రకటించారు మేకర్స్.
Also Read : Keerthy Suresh : మహానటి తర్వాత సినిమా అవకాశాలు రాలేదు
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..