టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, కొంత గ్యాప్ తర్వాత మరోసారి వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మిడిల్ ఏజ్ వయసులో పెళ్లి కష్టాలు, ఆ పరిస్థితే తీసుకువచ్చే హాస్యాస్పద సంఘటనలను ప్రధానాంశంగా తీసుకుని రూపొందిన ఆయన తాజా చిత్రం సుందరకాండ. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఇలా ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకటేష్ నిమ్మల పూడి. శ్రీదేవి విజయ్‌కుమార్, వ్రితి వాఘని కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం.. వినాయక చవితి కానుకగా, ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. తాజాగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తే..
Also Read : Coolie : ‘కూలీ’ లో తన పాత్ర పై కింగ్ నాగ్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్..
మిడిల్ ఏజ్‌లో ఉన్న ఓ యువకుడికి పెళ్లి కష్టాలు ఎలా వస్తాయో, ఆ సన్నివేశాలను పూర్తిగా హాస్యభరితంగా చూపించారు. నారా రోహిత్ కామెడీ టైమింగ్, సిట్యూవేషనల్ హ్యూమర్ ఈ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచాయి. చూస్తుంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ అని క్లియర్ గా తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం ఈ హిలేరియస్ ట్రైలర్ సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. రోహిత్ కెరీర్‌లో ఇది మళ్లీ లైట్ హార్ట్‌డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఈ వినాయక చవితి రేసులో సుందరకాండ ఎంత మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.