సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర తారలు భాషా భేదం లేకుండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ ఇప్పటికే తన LCU (Lokesh Cinematic Universe) ద్వారా ప్రేక్షకులను కొత్త యాక్షన్ అనుభవం అందించారు. కూలీతో ఆయన మాస్, ఎమోషనల్, స్టైల్ కలిపి మరో హిట్ అందించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టు 14 విడుదలతో ఈ సినిమా రజనీకాంత్, నాగార్జున అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని ఇవ్వనుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నటినటులంత కూడా వరుస ఇంటర్వ్యూలలో పాల్గోంటూ మూవీకి సంబంధించిన విషయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో..
Also Read : Rashmika : డబ్బులు ఇచ్చి ట్రోలింగ్ చేయిస్తున్నారు.. నిజాలు బయటపెట్టిన రష్మిక మందన్న !
ఇటీవల ‘కుబేర’తో విజయాన్ని అందుకున్న కింగ్ నాగార్జున, ‘కూలీ’ లో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ‘సైమన్’ అనే నెగటివ్ రోల్‌ను పోషిస్తున్న ఆయన, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ ‘కూలి’ లో నా పాత్ర చాలా బ్యాడ్‌గా ఉంటుంది.. మీరు అసలు ఊహించలేరు కూడా. అందుకే నా మనవళ్లకు ఎట్టి పరిస్థితిలోను ఈ పాత్ర గురించి చెప్పాలనుకోవడం లేదు, చూపించాలనుకోవడం లేదు” అని సరదాగా చెప్పారు. అలాగే రజనీకాంత్‌తో వర్క్ చేసిన అనుభవాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు.. ‘సూపర్‌స్టార్‌తో పని చేయడం అద్భుతమైన అనుభవం. సెట్‌లో ఆయన ఉంటే ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. తమిళ డైలాగుల విషయంలో నాకు చాలా సాయం చేశారు. నేను ఎంత నెగటివ్ రోల్‌లో ఉన్నప్పటికీ, ఆయన పాజిటివ్ ఎనర్జీతో సన్నివేశాలను నింపేశారు’ అని అన్నారు.