అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఆంధ్రలోని విజయవాడ, తెలంగాణాలోని ఖమ్మం పూర్తిగా నీట మునిగి, తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి టాలీవుడ్ నటులు భారీ విరాళం ప్రకటించారు.
Also Read: Vijay: G.O.A.T సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్న స్టార్ క్రికెటర్..?
జూనియర్ ఎన్టీఆర్, మహేశ్, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కలిపి కోటి రూపాయల సాయం అందించారు. తాజాగా టాలీవుడ్ బాహుబలి, రెబల్ స్టార్ ప్రభాస్ తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి రూ. 2 కోట్ల భారీ విరాళం ఇచ్చాడు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 ఆర్ధిక సాయం చేసారు. ఈ మేరకు అధికారకంగా ప్రకటించారు. తమ ఇన్నేళ్ళుగా ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు కష్టం వస్తే మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్ హీరోలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు సోనూసూద్ రూ. 2 కోట్ల విరాళం ప్రకటించడంతో పాటుగా ఎటువంటి అవసరం ఉన్న తనకు ఒక్క మెసెజ్ పెడితే మా టీమ్ సభ్యులు వస్తారని ఓ వీడియో రిలీజ్ చేసాడు సోనూసూద్.