అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా వరదలు సంభవించాయి. ఆంధ్రలోని విజయవాడ, తెలంగాణాలోని ఖమ్మం పూర్తిగా నీట మునిగి, తినడానికి తిండి తాగటానికి మంచి నీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి…
చిత్తూరు జిల్లాలో రాయల చెరువు నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. వందకుపైగా గ్రామాలను, పది వేల మంది ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న రాయలచెరువు వ్యవహారంపై అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అసలు చెరువు ఈ స్థితికి చేరడానికి బాధ్యులెవరన్న ప్రశ్న ఇపుడు చర్చనీయాంశమవుతోంది. ఆరు రోజుల కిందట చెరువు నిండినప్పుడే స్పందించి వుంటే వేలాదిమంది ఇళ్ళు వదలి వెళ్ళే పరిస్థితి వుండేది కాదంటున్నారు. రాయలచెరువు…