టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లో పూజ హెగ్డే ఒకరు. బిగినింగ్ లోనే పెద్ద స్టార్ లతో జత కట్టి అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ గురించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడుకు కూడా అనంతరం ఆఫర్‌లు తగ్గుతూ వచ్చాయి. దీంతో అందరి లాగే బాలీవుడ్ లోకి జంప్ అయ్యింది. అక్కడ సల్మాన్ వంటి బడా హీరోలతో జత కట్టి స్కిన్ షో కూడా పెంచినప్పటికీ పూజకి నిరాశే మిగిలింది. ఇలా గత కొంత కాలంగా వరుస డిజాస్టర్స్‌లో ఉన్న ఈ చిన్నది మంచి హిట్ కోసం ఎదురుచూస్తుంది. అయితే ఆఫర్‌లు తగ్గిన వెంటనే ప్రతి ఒక హీరోయిన్ చేసె పని స్పెషల్ సాంగ్స్.. గెస్ట్ రోల్. ఇప్పుడు పూజ కూడా ఇదే చేయబోతుంది.
Also Read:Priyanka Mohan: ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల: ప్రియాంక మోహన్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ వంటి స్టార్స్ నటిస్తుండగా. తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. ఏంటీ అంటే ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ బ్యూటీని తీసుకోబోతున్నారనే టాక్ కోలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట లోకేశ్ కనగరాజ్. ఇక ఈ సాంగ్ అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే తో తియనున్నాడట. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది. పూజా హెగ్డే తో స్పెషల్ సాంగ్ అనడంతో అభిమానులకు ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.